Abn logo
Aug 10 2020 @ 20:11PM

శ్రీలంకలో ఐదు నెలల తరువాత తెరుచుకున్న పాఠశాలలు

కొలంబో: శ్రీలంక వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి నెల మధ్య నుంచి పాఠశాలలు మూతపడి ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో విద్యాశాఖ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. జూలైలో ప్రయోగాత్మకంగా స్కూళ్లను తెరిచినప్పటికి.. కరోనా వ్యాప్తి చెందడంతో మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కమ్యూనిటీ వ్యాప్తి లేదని.. దీంతో స్కూళ్లను తెరవాలని నిశ్చయించుకున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. అయితే కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యాశాఖ స్పష్టంగా చెప్పింది. విద్యార్థులు ఫేస్‌మాస్క్ తప్పక ధరించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని.. బెంచీల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా చూడాలని విద్యాశాఖ పేర్కొంది. అంతేకాకుండా విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్కూళ్లలో క్యాంటీన్లు తెరవకూడదని.. క్రీడలు, ప్లేగ్రౌండ్‌లో ఆటలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 200కు పైగా విద్యార్థులు ఉంటే.. వారంతా ఒకేచోట గుమిగూడగుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా.. శ్రీలంకలో ఇప్పటివరకు 2,844 కరోనా కేసులు నమోదుకాగా.. 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 2,593 మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement
Advertisement
Advertisement