Sri Lanka vs India: తొలి వన్డే జరుగుతుందా?

ABN , First Publish Date - 2021-07-18T02:39:57+05:30 IST

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రేపు (ఆదివారం) ఇక్కడి ఆర్ ప్రేమదాస

Sri Lanka vs India: తొలి వన్డే జరుగుతుందా?

కొలంబో: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రేపు (ఆదివారం) ఇక్కడి ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా 2.30 గంటలకు టాస్ పడనుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం రేపు కొలంబోలో పగటి ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. రాత్రి ఇది 26 డిగ్రీలకు పడిపోతుంది. 


అలాగే, రేపు పగటి వేళ వర్షం పడే అవకాశాలు 70 శాతం ఉండగా, రాత్రి పూట వర్షం పడే అవకాశం 90 శాతం వరకు ఉన్నాయి. ఇక తేమ 78 నుంచి 84 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి వన్డే కోసం ఆశగా చూస్తున్న అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వరుణుడు పదేపదే అడ్డుతగిలి చికాకు తెప్పించాడు. ఆ తర్వాత భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. 

Updated Date - 2021-07-18T02:39:57+05:30 IST