సిరీస్‌ సమర్పయామి

ABN , First Publish Date - 2021-07-30T09:16:26+05:30 IST

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా ఎనిమిది టీ20 సిరీస్‌ విజయాల తర్వాత భారత్‌కిదే ఓటమి. అలాగే లంకకు ఐదు సిరీస్‌ పరాజయాల తర్వాత ఇదే విజయం...

సిరీస్‌ సమర్పయామి

  • 7 వికెట్లతో టీమిండియా చిత్తు
  • మూడో టీ20లో లంక విజయం
  • తొలిసారి పొట్టి సిరీస్‌ వశం

కొలంబో: బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా ఎనిమిది టీ20 సిరీస్‌ విజయాల తర్వాత భారత్‌కిదే ఓటమి.  అలాగే లంకకు ఐదు సిరీస్‌ పరాజయాల తర్వాత ఇదే విజయం. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా గురువారం జరిగిన ఆఖరి, మూడో మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో చిత్తయింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన లంక 2-1తో భారత్‌పై తొలి సారి  టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలు త బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ, బర్త్‌ డే బాయ్‌ హసరంగ (4/9) స్పిన్‌ మాయాజాలంతో.. భారత్‌ 20 ఓవర్లలో 81/8 పరుగులకే పరిమితమైంది.  లంకపై భారత్‌కిదే అత్యల్ప స్కోరు. కుల్దీప్‌ (23 నాటౌట్‌) తుది వరకు క్రీజులో నిలిచి.. టీ20ల్లో భారత అత్యల్ప స్కోరు 74 పరుగులను తప్పించాడు. కుల్దీప్‌, భువనేశ్వర్‌ (16), రుతురాజ్‌ గైక్వాడ్‌ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఽఛేదనలో లంక 14.3 ఓవర్లలో 82/3 స్కోరు చేసి గెలిచింది. రాహుల్‌ చాహర్‌ (3/15) మూడు వికె ట్లు పడగొట్టాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యా చ్‌’ హసరంగ (14), ధనంజయ (23) గెలిపించారు.


టప.. టపా..: హసరంగ మెలికలు తిరిగే బంతులకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ వద్ద సమాధానమే లేకపోయింది. ధవన్‌ డక్‌గా వెనుదిరగ్గా.. పడిక్కల్‌ (9) వికెట్ల ముందు దొరికిపోయాడు. శాంసన్‌ (0), గైక్వాడ్‌ను హసరంగ ఎల్బీ చేయగా..  రాణా (6)ను షనక అవుట్‌ చేయడంతో.. 36 పరుగులకే ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా చేజార్చుకుంది. 



స్కోరు బోర్డు

భారత్‌: గైక్వాడ్‌ (ఎల్బీ) హసరంగ 14, శిఖర్‌ ధవన్‌ (సి) డిసిల్వ (బి) చమీర 0, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (ఎల్బీ) మెండిస్‌ 9, శాంసన్‌ (ఎల్బీ) హసరంగ 0, నితీష్‌ రాణా (సి అండ్‌ బి) షనక 6, భువనేశ్వర్‌ (సి) షనక (బి) హసరంగ 16, కుల్దీప్‌ (నాటౌట్‌) 23, రాహుల్‌ చాహర్‌ (సి) భనుక (బి) షనక 5, వరుణ్‌ (సి) కరుణరత్నె (బి) హసరంగ 0, సకారియా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 81/8; వికెట్ల పతనం: 1-5, 2-23, 3-24, 4-25, 5-36, 6-55, 7-62, 8-63; బౌలింగ్‌: చమీర 4-0-16-1, కరుణరత్నె 2-0-12-0, మెండిస్‌ 2-0-13-1, హసరంగ 4-0-9-4, అకిల ధనంజయ 4-0-11-0, షనక 4-0-20-2. 


శ్రీలంక: ఫెర్నాండో (సి అండ్‌ బి) చాహర్‌ 12, భనుక (ఎల్బీ) చాహర్‌ 18, సమరవిక్రమ (బి) చాహర్‌ 6, ధనంజయ డిసిల్వ (నాటౌట్‌) 23, హసరంగ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 14.3 ఓవర్లలో 82/3; వికెట్ల పతనం: 1-23, 2-35, 3-56; బౌలింగ్‌: భువనేశ్వర్‌  2-0-9-0, వరుణ్‌ 3.3-0- 15-0, వారియర్‌ 3-0-23-0, చాహర్‌ 4-0-15-3, కుల్దీప్‌ 2-0-16-0. 

Updated Date - 2021-07-30T09:16:26+05:30 IST