డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెటర్

ABN , First Publish Date - 2020-05-25T23:57:51+05:30 IST

శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్ శేషన్ మధుశంకను డ్రగ్స్ కేసులో శ్రీలంక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం లోకల్

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెటర్

కొలంబో: శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్ శేహన్ మధుశంకను డ్రగ్స్ కేసులో శ్రీలంక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం లోకల్ మెజిస్ట్రేట్ అతన్ని రెండు వారాల రిమాండ్‌లో ఉంచాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా.. అతన్ని పన్నాల పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు గ్రాముల హెరాయిన్‌తో అతని పోలీసులకు దొరికిపోయాడు. 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మధుశంక తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించి అందరి మన్నలు పొందాడు. రెండు అంతర్జాతీయ టీ-20లు ఆడిన అతన్ని ఆ తర్వాత పక్కనపెట్టారు. 

Updated Date - 2020-05-25T23:57:51+05:30 IST