వేర్వేరుగా కూర్చునేవాళ్లం...

ABN , First Publish Date - 2021-01-24T06:36:02+05:30 IST

ఎనభైయ్యో దశకంలో జయప్రద, శ్రీదేవి గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలారు. ఇద్దరూ కెరీర్‌ మొదలు పెట్టింది దక్షిణాది చిత్రాలతోనే! ఆ తర్వాత బాలీవుడ్‌ తెరపైనా సందడి చేశారు.

వేర్వేరుగా కూర్చునేవాళ్లం...

నభైయ్యో దశకంలో జయప్రద, శ్రీదేవి గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలారు. ఇద్దరూ కెరీర్‌ మొదలు పెట్టింది దక్షిణాది చిత్రాలతోనే! ఆ తర్వాత బాలీవుడ్‌ తెరపైనా సందడి చేశారు. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య ఆ రోజుల్లో సఖ్యత ఉండేది కాదు. ఎడమొహం, పెడమొహం అన్నట్టే ఉండేవారట. ఈ విషయాన్ని కపిల్‌ శర్మ సెలబ్రిటీ షోలో జయప్రద చెప్పారు. ఇప్పుడు శ్రీదేవిని చాలా మిస్‌ అవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాయికలుగా మా ఇద్దరి మధ్య పోటీ ఉండేది. తక్కువ సమయంలో అగ్ర తారలుగా ఎదిగాం. అదే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేకుండా చేసింది అనుకుంటాను. నేనూ, శ్రీదేవి కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అక్క, చెల్లెలుగా కూడా నటించాం. అయినా సెట్లో ఏ రోజు ఒకరినొకరం పలకరించుకోలేదు. కనీసం మొహమొహాలు కూడా చూసుకునేవాళ్లం కాదు. తను ఒక మూలన కూర్చుంటే, నేనొక మూలన కూర్చునేదాన్ని. బాలీవుడ్‌ నటుడు జితేంద్ర ఎన్నోసార్లు మా ఇద్దరినీ కలపడానికి ప్రయత్నం చేశారు. ఓ రోజు భోజన సమయంలో మా ఇద్దరి మధ్య విభేదాలు పరిష్కరించుకోమని ఓ గదిలో పెట్టి తాళం వేశారాయన. ఓ గంట తర్వాత తలుపు తెరిచారు. ఇద్దరం చెరో వైపు వెళ్లాం తప్ప మాట్లాడుకోలేదు. వృత్తి పరమైన విభేదాలే మమ్మల్ని దూరంగా ఉంచాయి. కానీ ఏరోజూ ఒకరి గురించి ఒకరం తక్కువ చేసి మాట్లాడుకోలేదు. ఇప్పుడు శ్రీదేవి మన మఽధ్య లేదని తలచుకుంటే చాలా బాధ కలుగుతుంది’’ అని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు జయప్రద. 

- జయప్రద

Updated Date - 2021-01-24T06:36:02+05:30 IST