Abn logo
Sep 10 2021 @ 13:52PM

శ్రీకాకుళం జిల్లాలో జగ్జీవన్ రాం విగ్రహం ధ్వంసం

శ్రీకాకుళం: జిల్లాలోని పలాసలో గల సంత మైదానంలో జగ్జీవన్ రాం విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నది. విగ్రహ ధ్వంసంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

క్రైమ్ మరిన్ని...