Abn logo
Aug 23 2021 @ 13:57PM

ఏపీలో ఎస్సీలపై కొనసాగుతున్న దాడులు

శ్రీకాకుళం జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, కొంకడాపుట్టిలో దళితుడు లోహిదాసుపై అదే గ్రామానికి చెందిన గౌడ్ శ్రీనివాస్ దాడి చేశాడు. లోహిదాసు ఇంట్లోకి వచ్చాడన్న కోపంతో అతనిపై దారుణంగా ప్రవర్తించాడు. లోహిదాసును గ్రామంలో తిప్పుతూ చితకబాదాడు. గ్రామస్తులు నిలువరించినా వినకుండా కులం పేరుతో దూషిస్తూ కొట్టాడు. ఈ ఘటనలో లోహిదాసు చేయి విరిగింది. ముఖంపై గాయాలు అయ్యాయి.


గౌడు శ్రీనివాస్ తండ్రి గణేష్.. హోటల్‌కు వెళ్లి భోజనం తీసుకురావాలని లోహిదాసుకు చెప్పాడు. దీంతో భోజనం తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయంలో ఇంట్లోకి ఎందుకు వచ్చావంటూ లోహిదాసుపై మండిపడ్డ శ్రీనివాస్.. క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయిస్తే.. వారు కేసు నమోదు చేయకపోగా రాజీ చేసుకోవాలని సూచించారు. పైగా మెడికల్ బిల్లులు ఇప్పిస్తామంటూ సలహా ఇచ్చారు. చివరికి దళిత సంఘాల ఆందోళనతో శ్రీనివాస్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడు పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

క్రైమ్ మరిన్ని...