Abn logo
Oct 18 2020 @ 21:28PM

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఉద్రిక్తత

Kaakateeya

శ్రీకాకుళం : జిల్లాలోని వీరఘట్టంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాప్టిస్ట్ చర్చి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కళింగ పోలిరాజు (43) మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే.. మృతదేహంతో పోలీస్ స్టేషన్‌ ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. 


రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం వీరఘట్టంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇరు వర్గీయులను పీఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే కఠిన చర్యలు తప్పవని ఇరువర్గీయులను హెచ్చరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement