Abn logo
Oct 20 2021 @ 09:39AM

AP: స్కూల్ బస్సు బోల్తా...విద్యార్థి మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. మృతి చెందిన విద్యార్థిగా మైలపల్లి రాజుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులను స్థానికులు రక్షించారు.  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెరువులో పడ్డ బస్సును వెలికితీస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption