రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో శ్రీకాళహస్తి హవా

ABN , First Publish Date - 2022-01-26T05:58:25+05:30 IST

రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో శ్రీకాళహస్తి క్రీడాకారులు సత్తాచాటారు.

రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో శ్రీకాళహస్తి హవా
క్రీడాకారులను అభినందస్తున్న హెచ్‌ఎం రాజేశ్వరి తదితరులు

శ్రీకాళహస్తి, జనవరి 25: రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో శ్రీకాళహస్తికి చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. శాప్‌ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి విజయవాడలో రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అండర్‌-18 విభాగంలో శ్రీకాళహస్తి పట్టణం రాయలసీమ కళాశాల సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థి ఎస్‌.రేవంత్‌ పాల్గొని సింగిల్స్‌లో సత్తాచాటాడు. ప్రథమస్థానం పొందిన విద్యార్థిని ప్రముఖులు బంగారు పతకంతో సత్కరించారు. ఇంటర్‌జోన్‌ విభాగంలో జిల్లా తరపున రన్నరప్‌గానూ నిలిచాడు. శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి బి.కరుణకుమార్‌ అండర్‌-14 విభాగంలో రజత పతకం సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను రాయలసీమ కళాశాల డైరెక్టర్‌ కె.సుబ్బరామిరెడ్డి, ప్రిన్సిపాల్‌ జయభారత్‌రెడ్డి, హెచ్‌ఎం రాజేశ్వరి తదితరులు వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో అభినందించారు. 

Updated Date - 2022-01-26T05:58:25+05:30 IST