శాస్ర్తోక్తంగా మృత్యుంజయ హోమం

ABN , First Publish Date - 2020-03-27T10:05:04+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో లోక కల్యాణార్థం మహా మృత్యుంజయ హోమ పూజలను గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

శాస్ర్తోక్తంగా మృత్యుంజయ హోమం

శ్రీకాళహస్తి, మార్చి 26: శ్రీకాళహస్తీశ్వరాలయంలో లోక కల్యాణార్థం మహా మృత్యుంజయ హోమ పూజలను గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని మృత్యుంజయ లింగం వద్ద తొలుత కలశ స్థాపన చేసి గణపతి పూజ, పుణ్యావచనం నిర్వహించారు. దేవగణాన్ని ఆవాహనం చేశారు. అనంతరం మృత్యుంజయ జపం  హోమ పూజలు జరిపారు. హోమగుండంలో పూర్ణాహుతి సమర్పించి కలశ జలంతో మృత్యుంజయ లింగానికి అభిషేకాలు చేశారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. ఐదు రోజులపాటు జరిగే పూజలను పాంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో చంద్రశేఖరరెడ్డి, ఏఈవో మోహన్‌, పీఆర్వో హరియాదవ్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ లోకేష్‌రెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T10:05:04+05:30 IST