Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్వీయూ రెక్టార్‌గా శ్రీకాంత్‌ రెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 3: ఎస్వీయూ నూతన రెక్టార్‌గా సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వి.శ్రీకాంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ రాజారెడ్డి, రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ ఆయనకు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు. ఇప్పటి వరకు రెక్టార్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ సుందరవల్లి నెల్లూరులోని విక్రమ సింహపురం యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. దీంతో ఆ స్థానంలో శ్రీకాంత్‌రెడ్డిని నియమించగా, శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈయన్ను పలువురు విద్యార్థులు, ఉద్యోగులు అభినందించారు. 


శ్రీకాంత్‌రెడ్డి నేపథ్యమిదీ..

కలకడ మండలం ఎర్రకోటపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి 1982లో పీజీ, 1990లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ‘ఒత్తిడి- మానవ ప్రవర్తన’ ప్రత్యేక అంశంపై పరిశోధించారు. 1996లో సైకాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. మెన్స్‌ హాస్టల్‌ వార్డెన్‌గా, పీజీ ఎగ్జామ్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా, పీఆర్వోగా, సైకాలజీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎ్‌స)గా, విభాగాధిపతిగా, కాలేజ్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) డీన్‌గా, ఎస్వీయూ టీచర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా, సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఈయన పర్యవేక్షణలో 13 ఎంఫిల్‌, 16 పీహెచ్‌డీలు, 3 పీడీఎ్‌ఫలు పూర్తయ్యాయి. రెండు పరిశోధనా ప్రాజెక్టులు, 6 సదస్సులను నిర్వహించారు. 25 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 34సదస్సులకు హాజరయ్యారు. రాబోయే ఏడాదిలో రిటైర్‌ కానున్నారు. కాగా, రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఏపీఆర్‌సెట్‌-2021 కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Advertisement