Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాంతాచారి ఆశయాలు సాధించాలి

హుజూర్‌నగర్‌  రూరల్‌/ సూర్యాపేట టౌన్‌ / సూర్యాపేట రూరల్‌ / గరిడేపల్లి / తిరుమలగిరి / తుంగతుర్తి, డిసెంబరు 3: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆశయాలు సాధించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం శ్రీకాంతాచారి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో శ్రీకాంతాచారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డితో పాటు అమర్‌నాథ్‌రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి, కెఎల్‌ఎన్‌రెడ్డి, గూడెపు శ్రీనివాసు, గువ్వల వీరయ్య, శ్రీలతారెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేటలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్య క్రమంలో జిల్లా అధ్యక్షుడు పర్వతం సైదాచారి, బెజ్జంకి ఉపేంద్రాచారి, బైరోజు వెంకట్రమణాచారి, శ్రీధరాచారి, శ్రీనివాసచారి, బిక్షమాచారి, బ్రహ్మాచారి పాల్గొన్నారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ, మనుమయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్‌ పోతుగంటి వీరాచారి, లింగాచారి, నర్సింహాచారి, సైదాచారి, శ్రీనివాసచారి, దైద వెంకన్న పాల్గొన్నారు. ఇమాంపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం, సర్పంచ్‌ పాముల ఉపేందర్‌, ఎంపీటీసీ మామిడి కిరణ్‌, కుంభం వెంకన్నయాదవ్‌, రమణారెడ్డి, సుదర్శన్‌ పాల్గొన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, మాజీ ఎంపీటీసీలు రావుల ఉపేంద్ర, ఆంజనేయులు, జె.శ్రీనివా్‌సగౌడ్‌, పోకల వె.ంకటేశ్వర్లు, అందె కోటయ్య, నర్సింగ్‌ అంజయ్య, రమేష్‌ పాల్గొన్నారు.  తిరుమలగిరిలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనీరాజశేఖర్‌, వైస్‌చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరుమని యాదగిరి, కొమ్మినేని సతీష్‌ సందీప్‌, చారి పాల్గొన్నారు. తుంగతుర్తిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేపూరి బ్రహ్మచారి, కటకం సూరయ్య, ఓరుగంటి సత్యనారాయణ, రాములుగౌడ్‌, బూతం లింగయ్య, రమే్‌షగౌడ్‌, సతీష్‌, శ్రీనివాస్‌, నరేష్‌ పాల్గొన్నారు. 

హుజూర్‌నగర్‌లో శ్రీకాంతాచారి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి


Advertisement
Advertisement