Advertisement
Advertisement
Abn logo
Advertisement

చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా శ్రీకాంత్‌చారి ప్రాణత్యాగం

పొడిచేడులో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునితామహేందర్‌రెడ్డి

మోత్కూరు, డిసెంబరు 3: తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమ రుడైన కాసోజు శ్రీకాంత్‌చారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉం టుందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్‌ రెడ్డి అన్నారు. శ్రీకాంత్‌చారి స్వగ్రామం పొడిచేడులో శుక్రవారం  నిర్వ హించిన 12వ వర్ధంతి సభలో ఆమె మాట్లాడారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సాధనతో శ్రీకాంత్‌చారితో పాటు మిగతా అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరిందన్నారు. ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే శ్రీకాంత్‌చారికి నిజమైన నివాళి అని ఆమె అన్నారు. 

 కేసీఆర్‌ తండ్రి లాంటివారు: శంకరమ్మ

శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ తన కుమారుడు అమరు డైనప్పటి నుంచి తమ కుటుంబానికి  కేసీఆర్‌ను తండ్రిగా భావిస్తున్నా మన్నారు. కేసీఆర్‌ కూడా తమను అలాగే గౌరవించాలని కోరుకుంటు న్నామని శంకరమ్మ తెలిపారు.

నివాళులర్పించిన మంత్రి జగదీష్‌రెడ్డి

పొడిచేడు గ్రామంలో శ్రీకాంతాచారి విగ్రహానికి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇతర కార్యక్రమాలు ఉన్నందున వర్ధంతి సభలో మంత్రి పాల్గొనలేదు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఆయా కార్యక్ర మాల్లో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల మాజీ చైర్మన్‌ మందుల సామేల్‌, జడ్పీటీసీ గోరుపల్లి శారద, మోత్కూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రి, మార్కెట్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌ పేలపూడి మధు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు గుండిగ జోసెఫ్‌, అడ్డగూ డూరు ఎంపీపీ దర్శనాల అంజయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ఆత్మకూరు(ఎం), మోత్కూరు/సంస్థాన్‌ నారాయణపురం: ఆత్మకూరు(ఎం), మోత్కూరు, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో  శ్రీకాంతా చారి చిత్రపటానికి టీఆర్‌ఎస్‌, బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బీసు చందర్‌గౌడ్‌, బి.శేఖర్‌, సెక్రటరీ జనరల్‌ పంజాల వెంకటేశం,  బీఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ గుండు శ్రీను,  మందుల సురేష్‌, ఎలిమినేటి సంతోష్‌, పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ బీఎస్పీ ఉపాధ్యక్షుడు కేబీ రాజు, మండల ఇన్‌చార్జి ఎర్రబెల్లి నాగేశ్వర్‌,  గనం నరసింహ, అందోజు వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.Advertisement
Advertisement