నిరాడంబరంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2020-08-12T10:18:56+05:30 IST

కొత్తవలస మండలం అప్పన్న పాలెంలో శ్రీకృష్ణ దేవాల యంలో మాజీ వైస్‌ ఎంపీపీ, తెలుగురైతు జిల్లా అధ్య క్షుడు తిక్కాన చినదేముడు దంపతుల ..

నిరాడంబరంగా కృష్ణాష్టమి వేడుకలు

జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు మంగళ వారం నిరాడంబరంగా జరిగాయి.  కృష్ణుని ఆలయాల్లో, గీతామందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కరోనా కారణంగా ఇళ్లల్లోనే చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణల్లో అలరించారు. కొవిడ్‌-19 నిబంధ నలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉట్టి కొట్టే సంబరాలు ఎక్కడా నిర్వహించలేదు. 


ఆంధ్రజ్యోతి బృందం:కొత్తవలస మండలం అప్పన్న పాలెంలో శ్రీకృష్ణ దేవాల యంలో మాజీ వైస్‌ ఎంపీపీ, తెలుగురైతు జిల్లా అధ్య క్షుడు తిక్కాన చినదేముడు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోటపెద్దు ఉత్సవం, తప్పెటగుళ్లు, శ్రీకృష్ణ, గోపిక వేషధారణలు,  ఉట్టికొట్టడం వంటి కార్యక్రమాలు భౌతిక దూరం పాటిస్తూ సందడిగా జరిగాయి. చింతలపాలెంలో మాజీ సర్పంచ్‌లు కె.భీష్మ, పల్లా రామయ్య ఆధ్వర్యంలో, గొల్లపేటలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  వివిధ గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.


కొత్తవలస మండలం రామలింగపురం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దేవాలయంలో, కొత్తవలస-కె.కోటపాడు రోడ్డులోని పాత శివాలయం ప్రాంగణంలో గల కృష్ణుని ఆలయంలో, తుమ్మికాపల్లి రైల్వేగేట్‌ సమీపంలో నున్న గీతా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, గుమ్మలక్షీపురం, ఎల్‌.కోట, బాడంగి మండలాల్లో వివిధ గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. 


భోగాపురం మండలం మహారాజపేట గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఫ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో తామస్‌పేట దుర్గామహాపీఠంలో వేడుకలు జరిగాయి. పీఠాధిపతి సమతానంద స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రవణ చైతన్యానంద స్వామి ఆధ్వర్యంలో కృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు.


బొబ్బిలి పట్టణంలో స్థానిక పూల్‌బాగ్‌లోని  గీతామందిరంలో కృష్ణుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. బృందావనం ఫంక్షన్‌ హాల్‌లో మాజీ కౌన్సిలర్‌ యెన్నా బాబు, సామాజిక కార్యకర్త కృష్ణదాసు ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2020-08-12T10:18:56+05:30 IST