Abn logo
Aug 4 2021 @ 07:47AM

శ్రీలంక నావికాదళ సిబ్బందిపై కేసు

ప్యారీస్(చెన్నై): జాలర్లపై కాల్పులు జరిపిన ఏడుగురు శ్రీలంక నావికాదళ సైనికులపై వేదారణ్యం నేవీ అధికారులు కేసు నమోదుచేశారు. నాగపట్టణం హార్బర్‌ నుంచి గత నెల 28వ తేదీ అక్కరంపేటకు చెందిన గౌతమన్‌కు చెందిన మరపడవలో కలైసెల్వన్‌, దీపన్‌, రాజ్‌, జీవా, మారన్‌, అరసుమణి, మురు గానందం సహా పది మంది జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వారు ఆదివారం సాయంత్రం కొడియకరైకు ఈశాన్యంలో ఐదు నాటికల్‌ మైళ్ల దూరంలో చేపలు పడుతుండగా ఆ సమయంలో వచ్చిన లంక నావికాదళ సిబ్బంది సరిహద్దులు దాటారంటూ కాల్పులు జరిపారు. అందులో కలైసెల్వన్‌ తలలో బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అతడిని నాగపట్టణం ప్రభుత్వాసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేర్పించారు. ఈ నేపథ్యంలో, నాగపట్టణానికి చెందిన మురుగానందం వద్ద వాంగ్మూలం తీసుకొని, లంక నావికాదళానికి చెందిన ఏడుగురిపై భారతీయ ఆయుధ చట్టం, హత్యాయత్నం కేసును వేదారణ్యం నేవీ అధికారులు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.