Abn logo
Nov 22 2020 @ 17:03PM

కేంద్ర మంత్రుల మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తోంది: శ్రీనివాస్‌గౌడ్‌

Kaakateeya

హైదరాబాద్: గతంలో ఒకలా మాట్లాడి ఎన్నికలు రాగానే మాట మారుస్తున్న కేంద్ర మంత్రుల మాటలు చూస్తే తనకు ఆశ్చర్యమేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో ప్రధాని సైతం కేసీఆర్‌ను ప్రశంసించారని, అయితే ఎన్నికల కోసమే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాము ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తామనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రంపై ఛార్జిషీట్‌ వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు క్షమాపణ చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు. బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

Advertisement
Advertisement