Abn logo
Oct 5 2021 @ 14:03PM

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌: కళాకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలిలో ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులలోని కళను గుర్తించి ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కళాకారులను అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మండలాలు, జిల్లాల్లోని కళాకారులను డీపీఆర్వోలచే గుర్తించి పెన్షన్ ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...