గంగూలీ, అమిత్ షా, శ్రీనివాసన్‌లపై గుహ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-23T01:13:48+05:30 IST

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, కేంద్రహోం మంత్రి అమిత్ షాలపై ప్రముఖ చరిత్రకారుడు, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ)

గంగూలీ, అమిత్ షా, శ్రీనివాసన్‌లపై గుహ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, కేంద్రహోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీపై ప్రముఖ చరిత్రకారుడు,  కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) మాజీ సభ్యుడు రామచంద్రగుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌ను నడపడంలో వీరిద్దరూ బంధుప్రీతితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రంజీ ట్రోఫీ ఆటగాళ్లు సకాలంలో ఎందుకు బకాయిలు పొందలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘‘ఈ రోజు భారత క్రికెట్‌ను ఎన్.శ్రీనివాసన్, అమిత్ షాలు నడిపిస్తున్నారు. రాష్ట్ర అసోసియేషన్లను ఎవరి కుమార్తెనో, మరెవరి కుమారుడో నడిపిస్తున్నాడు. కుట్రలు, ఆశ్రిత పక్షపాతంలో బోర్డు మునిగిపోయింది. రంజీట్రోఫీ ఆటగాళ్లకు బకాయిలు చెల్లించడంలో బోల్డంత జాప్యం జరుగుతోంది. సంస్కరణలు జరుగుతాయని భావించినా ఫలితం లేకుండా పోయింది’’ అని గుహ ఆవేదన వ్యక్తం చేశారు. 


శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ గతంలో క్రికెట్ బెట్టింగు ర్యాకెట్‌లో పాల్గొనగా, అమిత్ షా కుమారుడు జే షా ప్రస్తుతం బీసీసీఐ బృందంలో సభ్యుడు. కాగా, బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సౌరవ్ గంగూలీపైనా రామచంద్రగుహ విరుచుకుపడ్డారు. ‘‘గంగూలీని చూడండి. బీసీసీఐ అధ్యక్షుడు. క్రికెట్ ఫాంటసీ గేమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత క్రికెటర్లలో డబ్బు కోసం ఇలాంటి దురాశ షాక్‌కు గురిచేస్తోంది’’ అని గుహ పేర్కొన్నారు. 2017లో బీసీసీఐని పారదర్శకంగా నడిపేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ)లోని నలుగురు సభ్యులలో రామచంద్రగుహ ఒకరు. అయితే, ఆ తర్వాత ఆరు నెలలకే ఆయన రాజీనామా చేశారు.  

Updated Date - 2020-11-23T01:13:48+05:30 IST