కన్నులపండువగా శ్రీనివాసుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-02-24T07:11:56+05:30 IST

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అయిన శ్రీనివాసుడి కల్యాణం కన్నులపండువగా జరిగింది. మండల కేంద్రంలోని పురాతన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను మూడు రోజులు గా వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

కన్నులపండువగా శ్రీనివాసుడి కల్యాణం
స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

గోవింద నామస్మరణతో మార్మోగిన తలమడుగు

తలమడుగు, ఫిబ్రవరి 23: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అయిన శ్రీనివాసుడి కల్యాణం కన్నులపండువగా జరిగింది. మండల కేంద్రంలోని పురాతన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను మూడు రోజులు గా వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.  యజ్ఞం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధ వారం యజ్ఞ పూర్ణహుతి, శ్రీలక్ష్మివేంకటేశ్వర కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. సాయంత్రం భాజాభంత్రీలు, మేళతాళాల మధ్య స్వామి వారి విగ్రహాలతో రథోత్సవ కార్యక్రమాన్ని పుర విధుల గుండా సాగింది. ఈ బ్రహ్మోత్సవాలకు మండలంలోని ఆయా గ్రా మాలతో పాటు తాంసి, భీంపూర్‌, ఆదిలాబాద్‌ల నుంచి, అలాగే మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమ అనంతరం గ్రామా నికి చెందిన బద్దం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం  చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, వేద పండితులు రంగచారి వేణుగోపాల చారి, కల్యాణ్‌ చారి, సర్పంచ్‌ కర్నాకర్‌ రెడ్డి, నాయకులు లోక భూమారెడ్డి, గోడం నగేష్‌, పిడుగు సంజీవ్‌ రెడ్డి, పాయల శంకర్‌, సుహాసినీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-24T07:11:56+05:30 IST