టీటీడీ ధార్మిక సంస్థనా.. లేక వ్యాపార సంస్థనా?: Srinivasananda

ABN , First Publish Date - 2021-12-11T19:04:44+05:30 IST

టీటీడీ అగరబత్తుల తయారీపై ఏపీ సాధు పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

టీటీడీ ధార్మిక సంస్థనా.. లేక వ్యాపార సంస్థనా?: Srinivasananda

విశాఖపట్నం: టీటీడీ అగరబత్తుల తయారీపై ఏపీ సాధు పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ టీటీడీ ధార్మిక సంస్థనా.. లేక వ్యాపార సంస్థనా అని ప్రశ్నించారు. శాస్త్రానికి విరుద్ధంగా టీటీడీ ఆగరబత్తుల వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. టీటీడీ వ్యాపార దృక్పథంతో తిరుమల పవిత్రతకుదెబ్బ తినే అవకాశం ఉందన్నారు. టీటీడీ పాలకమండలి.. హిందూ సమాజంపై గుదిబండలా తయారైందని విమర్శించారు. శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. వైవీ సుబ్బారెడ్డి వచ్చాకే టీటీడీ ఉనికిని కోల్పోతోందని అన్నారు. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీలో అవకాశం ఇస్తున్నారని తెలిపారు. చర్చిల నిర్మాణానికి హిందువుల డబ్బులు ఇస్తారా అని ప్రశ్నించారు. హిందువులే జగన్ సర్కార్‌కు సరైన బుద్ధి చెప్పాలని శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-12-11T19:04:44+05:30 IST