Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3 : జిల్లా రెవెన్యూ అధికారిగా పులి శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జేసీ వెంకటమురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాళ్లూరు మండలం రజానగరానికి చెందిన శ్రీనివాసులు ఇప్పటి వరకూ పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ సీఈవోగా పని చేశారు. కొవిడ్‌ సమయంలో కొంతకాలం సెలవులో ఉన్నారు. సెలవు అనంతరం ప్రభుత్వానికి రిపోర్టు చేయడంతో ఆయన్ను డీఆర్వోగా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గతంలో గుంటూరు డీఆర్వోగా పనిచేశారు.  

Advertisement
Advertisement