Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ‘Sriram Academy’

‘ద శ్రీరామ్‌ అకాడమీ’ హైదరాబాద్‌లో రెండో స్కూల్‌ను ఆరంభించింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో తొమ్మిది ఎకరాల క్యాంప్‌సలో ఇది ఏర్పాటైంది. అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్‌ కరికులమ్‌ను ఇక్కడ అమలు చేస్తున్నట్టు అకాడమీ తెలిపింది. పిల్లలు ప్రతి ఒక్కరిలో తెలివితేటలు అంతర్గతంగా ఉంటాయని తాము బలంగా నమ్ముతామని శ్రీరామ్‌ హైదరాబాద్‌ స్కూల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు, ఫౌండర్లు ఐశ్వర్య కుర్రా, సింధూర ఇందుకూరి ఈ సందర్భంలో వెల్లడించారు. అందులో భాగంగానే 2017లో తాము శ్రీ ఎడ్యుకేర్‌తో భాగస్వాములం అయ్యామని, తద్వారా హైదరాబాద్‌కు అటువంటి ఎడ్యుకేషన్‌ అందించాలని సంకల్పించామని వెల్లడించారు. అందులో భాగంగానే ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యున్నత విలువలు, నైపుణ్యాలను అలవర్చడానికి తోడు భవిష్యత్తులో తమదైన రంగాల్లో బలమైన నాయకులుగా ఎదిగేలా ఈ బాలలు ఎదిగేలా చూడాలన్నది తమ లక్ష్యమని ఫౌండర్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జ్యోతి రెడ్డి ఘంటా వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలు ఆరంభమయ్యాయి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

వెబ్‌సైట్‌: https://www.tsushyderabad.com/

Advertisement
Advertisement