శ్రీశైలంలో కన్నడిగుల వీరాచార విన్యాసాలు

ABN , First Publish Date - 2021-04-13T22:06:19+05:30 IST

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలలో గంగా వేరశైవుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

శ్రీశైలంలో కన్నడిగుల వీరాచార విన్యాసాలు

కర్నూలు జిల్లా: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలలో గంగా వేరశైవుల  విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్ణాటక కన్నడిగులు ఒళ్లు గగుర్లు పొడిచేలా శరీరభాగాలలో ఇనుప చువ్వలతో గుచ్చుకుని శ్రీశైలం భ్రమరాంబిక మల్లన్న భక్తులు వారి భక్తిని, మొక్కుబడులు విరాచార విన్యాసాలతో చాటుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని శివదీక్ష అగ్ని గుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. 


సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలో.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని కన్నడి భక్తులు భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. ఉగాది ముందురోజు రాత్రి ప్రధాన ఘట్టమైన వీరశైవుల అగ్నిగుండ ప్రవేశంలో భాగంగా తమ ఆడపడుచుగా ఆరాధించే భ్రమరాంబిక దేవి సన్నిధిలో కన్నడిగులు సర్వ పాపాలు హరించాలన్న సంకల్పంతో ఆగి గుండప్రవేశం చేశారు.

Updated Date - 2021-04-13T22:06:19+05:30 IST