శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,13,440 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-09-21T13:55:53+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు.

శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,13,440 క్యూసెక్కులు

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,13,440 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,03, 726 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.  పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.9946 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-09-21T13:55:53+05:30 IST