శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-07-20T05:30:00+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు..

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి

కర్నూలు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 1,10,239 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుండగా.. ప్రస్తుతం నీటి నిల్వలు 53.1795 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఇన్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుండగా.. అవుట్ ఫ్లో 5వందల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలుండగా.. ప్రస్తుతం నీటి నిల్వలు 175.279 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2021-07-20T05:30:00+05:30 IST