Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-01T14:06:23+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి పోటెత్తుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 5,32,300 క్యూసెక్కులు కాగా...

Kurnool: శ్రీశైలం ప్రాజెక్టుకు 10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి పోటెత్తుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 5,32,300 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 5.52 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-01T14:06:23+05:30 IST