Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-08-05T14:32:27+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు...

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‎ఫ్లో : 1,70,507 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో : 2,06,274 క్యూసెక్కులు కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం : 884.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు ఉంది. ప్రాజెక్ట్ కుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-05T14:32:27+05:30 IST