శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

ABN , First Publish Date - 2020-09-25T14:23:01+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,05,215 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  1,14,896 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 


Updated Date - 2020-09-25T14:23:01+05:30 IST