వైభవంగా శ్రీవారి గరుడ సేవ

ABN , First Publish Date - 2020-10-21T09:05:33+05:30 IST

వైభవంగా శ్రీవారి గరుడ సేవ

వైభవంగా శ్రీవారి గరుడ సేవ

తిరుమల, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వేంకటేశ్వర స్వామి తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై కొలువుదీరారు. మాడవీధుల్లో వేలాది మంది భక్తజనం మధ్య జరగాల్సిన గరుడ వాహనసేవ.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయంలోనే ఏకాంతంగా జరిపారు. గర్భాలయంలోని మూలమూర్తికి అలంకరించే సహస్ర నామమాల, లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సూర్యకటారి, పుష్ప గజమాలతో ఆలయంలోని రంగనాయక మండపంలో మలయప్పస్వామిని అలంకరించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి పక్కనే ఉన్న కల్యాణోత్సవ మండపంలో గరుడునిపై కొలువుదీర్చారు. అక్కడ దివ్యప్రబంధం, వేదపారాయణం, శాత్తుమొర నిర్వహించారు.  కాగా, ఉదయం 9 గంటలకు మోహినీరూపంలో శృంగార రసాథి దేవతగా శ్రీవారు సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే తిరుచ్చిపై కృష్ణస్వామి దివ్య దర్శనమిచ్చారు.

Updated Date - 2020-10-21T09:05:33+05:30 IST