అమ్మవారికి శ్రీవారి సారె ట్రయల్‌రన్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2021-11-28T07:16:21+05:30 IST

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ధ్వజారోహణంతో ప్రారంభమై డిసెంబరు 8న జరిగే పంచమీతీర్థంతో ముగుస్తాయి.

అమ్మవారికి శ్రీవారి సారె ట్రయల్‌రన్‌ సక్సెస్‌
సారెను తీసుకొస్తున్న అధికారులు

తిరుచానూరు, నవంబరు 27: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ధ్వజారోహణంతో ప్రారంభమై డిసెంబరు 8న జరిగే పంచమీతీర్థంతో ముగుస్తాయి. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈదఫా కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏటా పంచమీతీర్థం రోజున అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె వస్తుంది. ఈసారి ముందస్తుగా శనివారం ఉదయం సారె ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుంచి రాములవారిగుడి, చిన్నబజారువీధి, గాంధీరోడ్డు, గోవిందరాజస్వామి ఆలయం, సున్నపువీధి, అమృత థియేటర్‌ జంక్షన్‌, ఓవర్‌బ్రిడ్జి, లక్ష్మీపురం మీదుగా పద్మావతిపురం  వరకు.. అక్కడినుంచి అమ్మవారి ఆలయం వరకు శ్రీవారి సారెను ఏనుగులపైన టీటీడీ అధికారులు తీసుకొచ్చారు. వీజీవో మనోహర్‌, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏవీఎస్వో వెంకటరమణ, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, వీఐలు మహేష్‌, సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T07:16:21+05:30 IST