ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాలు

ABN , First Publish Date - 2021-02-27T21:04:25+05:30 IST

ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని టీటీడీ పాలక

ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాలు

 తిరుమల: ముంబై, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని టీటీడీ పాలక మండలి పేర్కొంది. టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బర్డ్ హాస్పిటల్స్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని పాలక మండలి ప్రకటించింది. భవనాల నిర్మాణానికి 9 కోట్ల రూపాయలను కేటాయించింది. టీటీడీ పరిధిలోని వేదవిజ్ఞాన పీఠం పరిధిలోకి వేదపాఠశాలు అన్నింటిని  తీసుకువస్తామని ప్రకటించింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ వినియోగాన్నినియంత్రించడంతో పాటు గ్రీన్ పవర్‌ని వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపింది. ముంబాయి, జమ్మూ‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మండలి పేర్కొంది. 


ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతామని పాలక మండలి తెలిపింది. ఆర్జిత సేవలు ప్రారంభించే లోపు తిరుమలలోని వివిధ విభాగాలలో విధులలో వున్న ఉద్యోగులకు కరోనా సోకకుండా వ్యాక్సినేషన్ వేయిస్తామని పాలకమండలి పేర్కొంది. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొంది. గో మాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి  తీర్మానం చేసి పంపుతున్నామని పాలకమండలి ప్రకటించింది. 

Updated Date - 2021-02-27T21:04:25+05:30 IST