Abn logo
Aug 14 2020 @ 13:20PM

శింబు జోడీగా.. ?

మిస్కిన్‌ దర్శకత్వంలో శింబు హీరోగా నటించనున్న తాజా చిత్రంలో హీరోయిన్‌గా అందాల నటి శ్రుతిహాసన్‌ను ఎంపికచేయనున్నారు. ‘చిత్తిరం పేసుదడి’, ‘అంజాదే’, ‘యుద్ధమ్‌ సెయ్‌’, ‘సైకో’, ‘ఆట్టుకుట్టి యుమ్‌’, ‘పిశాసు’, ‘తుప్పరివాలన్‌’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిస్కిన్‌ ఇటీవల ‘తుప్పరివాలన్‌ -2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లండన్‌లో తొలి షెడ్యూలు షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆ చిత్రం హీరో విశాల్‌తో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా వైదొలగారు. మిగతా షెడ్యూలు షూటింగ్‌కు విశాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మిస్కిన్‌ ఓ మంచి కథతో  చక్కని స్ర్కీన్‌ ప్లే సిద్ధం చేశారు. ఆ కథ విన్న హీరో శింబునటించేందుకు వెంటనే అంగీకరించారు. త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభంకానుందని స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement