Abn logo
May 27 2020 @ 21:14PM

జనవరి 8కే ఫిక్స్ అయిన రాజమౌళి

‘బాహుబ‌లి’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ చిత్ర విడుదల విషయంలో రెండు సార్లు విడుదల తేదీని మార్చారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో మరోసారి ఈ చిత్ర విడుదల తేదీలో మార్పు ఉండబోతుందంటూ వార్తలు రావడంతో పాటు ఈ మధ్య నిర్మాత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.


అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని జనవరి 08వ తేదీన థియేటర్లలోనికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒక్కసారి లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చాక షూటింగ్‌ను పరుగులు పెట్టించాలని, దీని కోసం యూనిట్‌ను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. భారీగా అనుకున్న సీన్స్ విషయంలో కూడా మార్పులు చేశారని, నాన్‌స్టాప్‌గా షూటింగ్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహరాలు జరిగేందుకు రాజమౌళి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు. సో.. ఈ వార్త నిజంగా మెగానందమూరి అభిమానులకు పండగలాంటిదే అని చెప్పుకోవాలి. 

Advertisement
Advertisement
Advertisement