బోయపాటిగారూ.. ఆ సీక్రెట్ మాకూ చెప్పండి: రాజమౌళి

బాలయ్యగారు ఆటంబాంబ్ లాంటి వారు.. ఆ బాంబ్‌ని ప్రయోగించడం ఒక్క బోయపాటిగారికే తెలుసని అన్నారు దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. 


ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘బోయపాటిగారూ.. మళ్లీ జనాల్లో ఊపు తెప్పించినందుకు థ్యాంక్యూ. ఈ వేడుకలో ఎటువంటి కోలాహలం ఉందో.. డిసెంబర్ 2 నుండి వరుసగా అలాగే ఉండాలి.. ఉంటుంది కూడా. అందుకు నాంది పలికిన మీకు ధన్యవాదాలు. బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్. ఆ బాంబ్‌ని ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీనుగారికి తెలుసు. ఆయన ఆ సీక్రెట్‌ని అందరికీ చెప్పాలి. ఆయన దగ్గరే దాచుకుంటే కుదరదు. అలాగే బాలయ్యగారు కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలి. డ్యాన్స్‌లు చూస్తుంటే మతిపోతుంది. చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా థియేటర్‌లో ‘అఖండ’ పాత్ర కోసం అందరూ ఎలా అయితే వేచి చూస్తున్నారో.. నేను కూడా అలాగే వేచి చూస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ షో పక్కాగా చూడబోతున్నా. అఖండ పెద్ద హిట్టవ్వాలి. మళ్లీ ఇండస్ట్రీకి మాంచి ఊపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్రానికి పనిచేసిన థమన్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. అందరికీ ఆల్ ద బెస్ట్..’’ అన్నారు.

Advertisement