యువకుడిపై కత్తిపోట్లు..

ABN , First Publish Date - 2021-02-25T05:16:14+05:30 IST

యువకునిపై హత్యాయత్నంతో జిల్లా కేంద్రంలో బుధవారం అలజడి నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో లక్ష్మణ్‌ అనే బైక్‌ మెకానిక్‌పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు పులి హరీస్‌ కత్తితో దాడిచేశారు.

యువకుడిపై కత్తిపోట్లు..

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 24: యువకునిపై హత్యాయత్నంతో జిల్లా కేంద్రంలో బుధవారం అలజడి నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో లక్ష్మణ్‌ అనే బైక్‌ మెకానిక్‌పై అదే ప్రాంతానికి చెందిన యువకుడు పులి హరీస్‌ కత్తితో దాడిచేశారు. టూటౌన్‌ పరిధిలోని అంబటి సత్రం ప్రాంతంలోని ఘెషాసుపత్రివద్ద  బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు క్షతగాత్రున్ని అంబులెన్స్‌లోఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉద్దేశపూర్వకం గానే కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపిం చారు. ఈ ఘటనకు సంబంధించి లక్ష్మణ్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని, దాడిచేసిన వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  సీఐ శ్రీనివాసరావ ు తెలిపారు. 


Updated Date - 2021-02-25T05:16:14+05:30 IST