ఎడారిలో రాళ్లను అక్షరాలుగా పేర్చి...

ABN , First Publish Date - 2021-07-13T05:30:00+05:30 IST

అదో ఎడారి. ఆ ఎడారిలో కొన్ని వేల మంది పేర్లు, రకరకాల భావాలు తెలియజేయడంకోసం రాళ్లను

ఎడారిలో రాళ్లను అక్షరాలుగా పేర్చి...

అదో ఎడారి. ఆ ఎడారిలో కొన్ని వేల మంది పేర్లు, రకరకాల భావాలు తెలియజేయడంకోసం రాళ్లను అక్షరాలుగా పేర్చారు. మరి ఆ రాళ్లను పేర్చిందెవరు? ఆ ఏడారి ఎక్కడుంది? ఆ విశేషాలు ఇవి...


 అమెరికాలోని అరిజోనాలో యుమ అని చిన్న పట్టణం ఉంది. ఇక్కడ గ్రాఫిటీ మెసా పేరుతో ఒక ప్రదేశం ఉంది. తెల్లటి ఇసుకతో ఎడారిని తలపించేలా ఉంటుందీ ప్రదేశం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ సైనికులకు శిక్షణ ఇచ్చారు.


 ఓ వైపు యుద్ధం. తిరిగి ఇంటికి వెళతామో లేదో నమ్మకం లేదు. ఆ సమయంలో సైనికులు తమ మనసులో భావాలను తమ వాళ్లకు తెలియజేయడం కోసం అక్కడి రాళ్లను అక్షరాలుగా పేర్చారు.


 బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ ఎడారి నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. వారి అంచనా ప్రకారం సుమారు 10 వేల పేర్లు ఎడారిలో పేర్చారు. పేర్లు, సందేశాలు, తేదీలు, డ్రాయింగ్స్‌... రకరకాల సందేశాలతో ఆ ఎడారి నిండిపోయి కనిపిస్తుంది. 


Updated Date - 2021-07-13T05:30:00+05:30 IST