సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , First Publish Date - 2022-04-21T04:23:23+05:30 IST

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, ఇతర ఉద్యోగులు విధుల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

సిబ్బంది సమయపాలన పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ

- జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి
మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, ఇతర ఉద్యోగులు విధుల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని బుధవారం కలెక్టరేట్‌ భవన సముదా యంలోని కలెక్టర్‌ చాంబర్‌లో పోషణ్‌ పక్వాడా, గిరి పోషణ, పోషన్‌ అభియాన్‌, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ, విద్య, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో పాటు సీడీీ పవోలు, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చెన్నూరు పరిధిలోని మండలాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సమయ పాలన పాటించ కపోవడంపై సీడీపీవో మనోరమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌ వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, పిల్లలలకు సరైన సమయానికి పోషకాహారం అందించాలన్నారు. పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని పిల్లలకు పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలన్నారు. తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సమావేశానికి సరైన వివరణ లేకుండా గైర్హాజరైన లక్షెట్టిపేట సీడీపీవో రేష్మాకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు. జిల్లాలో 969 మంది అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారని, ఆయా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రోజు సమయ పాలన పాటిస్తూ తెరవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జనార్ధన్‌, షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-21T04:23:23+05:30 IST