స్టఫ్ఫ్‌డ్‌ క్యాప్సికమ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్‌- అయిదు, ఆలుగడ్డ- నాలుగు, పచ్చి బఠానీ- అర కప్పు, ఉల్లి- ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), పచ్చి మిర్చి- ఒకటి, గరం మసాలా, పసుపు, కారం- చెరో పావు స్పూను, ఉప్పు, నూనె- తగినంత, కొత్తి మీర- రెండు రెబ్బలు.


తయారుచేసే విధానం: ముందుగా ఆలుగడ్డల్ని ఉడికించుకుని పొట్టుతీసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్‌ లోపలి గింజల్ని తీసేసి సిద్ధం చేసుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని దోరగా వేయించాక, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు, కారప్పొడి, పచ్చిబఠానీ వేసి కలపాలి. దీనికి ఉడికించిన ఆలుగడ్డల్ని కూడా వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తరవాత గరం మసాలా పొడి, ఉప్పు జతచేయాలి. కొత్తిమీర తురుమును కూడా వేసి స్టవ్‌ కట్టేయాలి. చల్లారిన తరవాత ఒక్కో క్యాప్సికమ్‌లో ఈ మిశ్రమాన్ని నింపాలి. ఓ పాన్‌లో నూనె వేసి క్యాప్సికాలన్నీ పెట్టి మూతమూసి మగ్గిస్తే స్టఫ్ఫ్‌డ్‌ క్యాప్సికమ్‌ రెడీ.

క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌మల్‌పావునమక్‌ పరె అరటిపువ్వు కొబ్బరి కూరవెజ్‌ మోమోస్‌వాటర్‌మెలన్‌ లెమనేడ్‌రాజ్‌ కచోరిస్వీట్‌ పొటాటో పఫ్స్‌కొత్తిమీర వడలుఓట్స్‌ చిల్లా
Advertisement
Advertisement