మీ పార్టీలోనే రౌడీల రాజ్యం : ఎంకే స్టాలిన్‌

ABN , First Publish Date - 2021-02-27T15:15:02+05:30 IST

భారతీయ జనతా పార్టీ రౌడీలకు ఆవాసంగా మారిందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కొంతమంది రౌడీలను చేర్చుకుని అసత్య ఆరోపణలు...

మీ పార్టీలోనే రౌడీల రాజ్యం : ఎంకే స్టాలిన్‌

ప్రధాని వ్యాఖ్యలకు స్టాలిన్‌ కౌంటర్‌

చెన్నై/అడయార్(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ రౌడీలకు ఆవాసంగా మారిందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కొంతమంది రౌడీలను చేర్చుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాంటూ మండిపడ్డారు. విల్లుపురం జిల్లా సెంజిలో జరిగిన మీ నియోజకవర్గంలో స్టాలిన్‌ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. గురువారం కోయంబత్తూరులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ డీఎంకే హయాంలో హింస రాజ్యమేలిందంటూ విమర్శించారు. వీటికి స్టాలిన్‌ కౌంటరిచ్చారు.  2002లో గుజరాత్‌ రాష్ట్రం లో జరిగిన మత కలహాలను ఏ ఒక్కరూ ఇప్పటికీ మరచిపోలేదన్నారు. కార్పొరేట్‌ వర్గాలకు మేలు చేకూర్చేలా సాగు చట్టాలతో పాటు పౌర సత్వ చట్టాలను తీసు కొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గూండాలకు, రౌడీలకు బీజేపీ ఆవాస కేంద్రంగా మారిందన్నారు. రౌడీలను పార్టీలో చేర్చుకుని, వారితో తమపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నాంటూ ఎంకే స్టాలిన్‌ ఆరోపిం చారు. మహిళా నేతలకు మార్గదర్శిగా జయలలిత ఉన్నారని మోదీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మోదీని జయలలిత ఒకపుడు మోదీయా? లేడీయా? అని అన్న మాటలు మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. అలాంటి బీజేపీతో అన్నాడీఎంకే నేతలు కలిసార న్నారు. అవినీతిలో కూరుకుపోయిన అన్నా డీఎంకే ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఐదేళ్ళ కాలంలో తాను చేసిన తప్పుల నుంచి బయటపడేందుకే మోదీతో ముఖ్యమంత్రి ఎడప్పాడి అంటిపెట్టుకుని ఉన్నారన్నారు. ముఖ్యంగా, గత అన్నాడీఎంకే పాలన శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. పళనిస్వామికి, పన్నీర్‌ సెల్వంకు కేవలం రుణాలు తీసుకోవడమే తెలుసన్నారు. తమ బినామీలకు రూ.40 వేల కోట్ల టెండర్లను కేటాయించారని స్టాలిన్‌ ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారు తన ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం సాధ్యమా అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారను. మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్న విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోవదన్నారు. పైగా తాను కలైంజర్‌ కరుణానిధి బిడ్డనని, ఖచ్చితం గా  తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-27T15:15:02+05:30 IST