నీట్‌ రద్దు చేయండి: ప్రధానికి స్టాలిన్‌ లేఖ

ABN , First Publish Date - 2020-07-09T15:22:38+05:30 IST

నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రదాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతటా నాలుగు నెలలుగా

నీట్‌ రద్దు చేయండి: ప్రధానికి స్టాలిన్‌ లేఖ

చెన్నై: నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రదాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతటా నాలుగు నెలలుగా విద్యాసంస్థలు మూతపడ్డాయని, విద్యాసంవత్సరంలో ఇప్పటికే మూడు నెలలు కోల్పోయారని, ఈ పరిస్థితుల్లో నీట్‌ నిర్వహిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేరని స్టాలిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ఆలిండియా కోటా రద్దు చేసి, రాష్ట్రాలలో బీసీలకు, ఓబీసీలకు మెడికల్‌ సీట్లు లభించేందుకు దోహదం చేయాలని కూడా మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. నీట్‌ను రద్దు చేసి ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలే వైద్యకోర్సులలో ప్రవేశానికి పోటీ పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని స్టాలిన్‌ కోరారు.

Updated Date - 2020-07-09T15:22:38+05:30 IST