నేడు రాష్ట్రపతితో స్టాలిన్‌ భేటీ

ABN , First Publish Date - 2021-07-19T16:32:54+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలుసుకుని

నేడు రాష్ట్రపతితో స్టాలిన్‌ భేటీ

‘నీట్‌’పై ప్రత్యేక వినతి కోసమేనా?!

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలుసుకుని మెకెదాటు ఆనకట్ట, నీట్‌  నుంచి మినహాయింపు తదితర అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించను న్నారు. జూన్‌ 17న స్టాలిన్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపుని వ్వాల ని, కావేరి నదిపై మెకెదాటు వద్ద కర్నాటక ప్రభుత్వం నిర్మించనున్న ఆనకట్టను అడ్డుకోవాలని, జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన మళ్ళీ విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఆయన బసచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతిభవన్‌కు వెళ్ళి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను కలుసుకోను న్నారు. ఆ సందర్భంగా మెకెదాటు వివాదం, నీట్‌ మినహాయింపు, రాష్ట్రానికి టీకాల కేటాయింపు తదితర కీలకమైన అంశాలపై స్టాలిన్‌ ఆయనకు  వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తైలవర్ణ చిత్రపటం ఆవిష్క రణకు రావాలని రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు. ఈ విషయమై డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి గా పదవిని చేపట్టిన తర్వాత స్టాలిన్‌ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకు నేందుకు ప్రయత్నించారని, రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి అధికం కావటంతో ఢిల్లీ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రపతిని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ లభించడంతో ఆదివారం సాయంత్రం స్టాలిన్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారని చెప్పారు. 


స్టాన్‌స్వామికి స్టాలిన్‌ నివాళి

దివంగత జన హక్కుల నేత, క్రైస్తవ మతగురువు స్టాన్‌స్వామి అస్థికల కలశం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఆ పార్టీ ఎంపీ కనిమొళి తదితరులు నివాళులర్పించారు. స్థానిక లయోలా కాలేజీ ప్రాంగణంలో ఆదివారం ఉదయం స్టాన్‌స్వామి అస్థికలున్న కలశం వద్ద నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆ కళాశాల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి  స్టాలిన్‌, ఆయన సోదరి, డీఎంకే ఎంపీ కనిమొళి స్టాన్‌స్వామి అస్థికలశం, చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఎంపీ దయానిధి మారన్‌, శాసనసభ్యులు చిందనై సెల్వన్‌, ఇన్రికో ఇరుదయరాజ్‌, రాష్ట్ర మైనారిటీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీటర్‌ అల్ఫోన్స్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రైస్తవ మత ప్రత్యేక ప్రార్థనల్లో వీరందరూ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-19T16:32:54+05:30 IST