స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2021-12-01T04:33:02+05:30 IST

వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. గూడూరు మండలంలో 400 ఎకరాలకు పైగా నారుమళ్లు దెబ్బతిన్నాయి.

స్తంభించిన జనజీవనం
గూడూరు: నీటమునిగినపొలాలు

దెబ్బతిన్న నారుమళ్లు

మగ్గం గుంతల్లోకి నీరు

 ట్రాఫిక్‌కు అంతరాయం

గూడూరు, నవంబరు 30: వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. గూడూరు మండలంలో 400 ఎకరాలకు పైగా నారుమళ్లు దెబ్బతిన్నాయి.  చెన్నూరులో మగ్గం గుంతల్లోకి నీ రు చేరడంతో  తీవ్రంగా నష్టపోయామని  చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిశంకర కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై నీరు ప్రహిస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  ఆర్డీవో మురళీకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ శ్రీని వాసులురెడ్డి  బ్రిడ్జిపై తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసి కొన్ని వాహనాలను, వరదనీరు ప్రహిస్తున్న జాతీయరహదారిపై భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. గూడూరు డిపో నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సులు తక్కువగా నడపడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు  వేములపాళెం చప్టాపై వరదతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోటుపాళెం చలివేంద్రంగుంట సమీపంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వరదనీరు చేర డంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. తిప్పవరప్పాడు సమీపంలో మంగళవారం సాయంత్రం వరద ఉధృతి పెరగడంతో సైదాపురం, రాపూరు, పొదల కూరు మార్గాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ఆది శంకర కళాశాల సమీపంలోని జాతీయ రహదారి వద్ద రాకపోకలను ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు  పరిశీలించారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రంలో ఆహారపొట్లాలను అందజే శారు.  బొమిడి శ్రీనివాసులు, మురళీ పాల్గొన్నారు.


ఉధృతంగా వాగులు

డక్కిలి:   సంగనపల్లి చెరువు కలుజు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో  తహసీల్దార్‌ ప్రసాద్‌ రాకపోకలను నిలిపివేశారు. తెలుగుగంగ కాలువకట్ట కోతకు గురవుతోందని గుర్తించిన అధికారులు పోలీసు పహారాఏర్పాటు చేశారు. మార్లగుంట గిరిజన కాలనీలోకి నీళ్లు ప్రవేశించడంతో ప్రజలను డక్కిలి గురుకుల కళాశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.  వెంకటగిరి-గూడూరు మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో నెల్లూరు, చెన్నై, తిరుపతి  వెళ్లే వాహనాలన్నీ డక్కిలి మీదుగా నడుస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా  ఉన్న ప్రాంతాల్లో ఎస్‌ఐ నరసింహరావు పోలీసులను కాపలా ఉంచారు.  మాదిగ ఉద్యోగ సమాఖ్య నాయకుడు దూడల పెంచలయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ గద్దల మునెయ్య, దళితసేన వెంకన్న సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


ఆగని వర్షం

రాపూరు: రాపూరులో మంగళవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ కుండపోత వర్షం కురిసింది. ఆంజనేయ పురం, సైదాదుపల్లి కాలనీల్లో ఇళ్లలోకి  వర ్షపు నీరు చేరింది. పెద్ద చెరువు అలుగు ప్రవాహంతో నవాబుపేట గ్రామ రోడ్డు ఛిద్రమైంది.  అలుగులు, కట్టలు తెగిపోవడంతో పలు తోటలు ఇప్పటికీ నీళ్లలో నానుతున్నాయి. దీంతో నిమ్మ, మామిడి చెట్లకు ప్రమాదమని రైతులు వాపోతున్నారు. రాపూరు నెల్లూరు రోడ్డులో రహదారి మీద వర్షపు నీరు ప్రవహిస్తోంది.  రైల్వే అండర్‌ బ్రిడ్జిల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. 



Updated Date - 2021-12-01T04:33:02+05:30 IST