వృత్తి నిపుణులకు ప్రామాణిక ఇండెమ్నిటీ పాలసీ

ABN , First Publish Date - 2021-01-20T08:37:43+05:30 IST

బీమా కంపెనీలు వృత్తి నిపుణులకు ఇచ్చే ఇండెమ్నిటీ పాలసీలకూ త్వరలో నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడబోతున్నాయి.

వృత్తి నిపుణులకు ప్రామాణిక ఇండెమ్నిటీ పాలసీ

సిఫారసు చేసిన ఐఆర్‌డీఏఐ కమిటీ

న్యూఢిల్లీ: బీమా కంపెనీలు వృత్తి నిపుణులకు ఇచ్చే ఇండెమ్నిటీ పాలసీలకూ త్వరలో నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పడబోతున్నాయి. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) నియమించిన ఒక కమిటీ ఇందుకోసం ఇప్పటికే కొన్ని సిఫారసులు చేసింది. సంబంధిత వర్గాలు ఈ సిఫారసులపై వచ్చే నెల 7 లోగా తమ అభిప్రాయాలు తెలపాలని ఐఆర్‌డీఏఐ కోరింది. బ్రోకర్లు, కార్పొరేట్‌ ఏజెంట్లు, వెబ్‌ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఇలాంటి ఇండెమ్నిటీ పాలసీలు తీసుకుంటాయి. వీరి సేవల వల్ల ఖాతాదారులకు ఏమైనా నష్టం సంభవిస్తే ఈ పాలసీ కింద వారికి బీమా రక్షణ లభిస్తుంది. ఖాతాదారులకు జరిగే నష్టాన్ని ఇండెమ్నిటీ పాలసీ ఇచ్చిన బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ పాలసీలను ప్రామాణీకరించాలని పరిశ్రమ వర్గాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. 


కమిటీ ప్రధాన సిఫారసులు : 

 కొత్త ఇండెమ్నిటీ పాలసీ కింద పాలసీ తీసుకునే వ్యక్తికి జరిగే అన్ని రకాల నష్టాలకు బీమా రక్షణ

 ఇండెమ్నిటీ పాలసీల్లో అపరిమిత నష్టపరిహారానికి చోటు ఉండకూడదు

 వార్షిక ప్రాతిపదికపై ప్రీమియం చెల్లింపులు. 

 తనిఖీ తర్వాతే ప్రీమియం చెల్లింపు

 వాయిదాల పద్దతిలో ప్రీమియం చెల్లింపులు ఉండవు.

Updated Date - 2021-01-20T08:37:43+05:30 IST