Advertisement
Advertisement
Abn logo
Advertisement

17000 పైన నిలకడ అవశ్యం

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమై 17000 కన్నా దిగజారినా తదుపరి మంచి రికవరీ సాధించి చివరికి ఈ కీలక స్థాయి కన్నా పైనే క్లోజయింది. ఇది సానుకూల సంకేతం. ఈ క్రమంలో 17500 వరకు వెళ్లినా గత శుక్రవారం మరో భారీ కరెక్షన్‌ చవి చూడడం వల్ల తక్షణ అప్‌ట్రెండ్‌ను ధ్రువీకరించలేకపోయింది.  వీక్లీ చార్టుల ప్రకారం నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్యన ముగియడం అనిశ్చిత ధోరణి సంకేతం. ఈ పరిస్థితిలో తదుపరి దిశ తీసుకునే ముందు కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. అంతర్జాతీయ సంకేతాల ప్రకారం మార్కెట్‌ మరింత అప్రమత్త వైఖరిలో సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణంలో 17000 వద్ద మరో గట్టి పరీక్ష ఎదురుకావచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: మరింత రికవరీ పథంలో సాగినట్టయితే 17350, 17600 వద్ద ప్రధాన నిరోధాలున్నాయి. 17600 స్వల్పకా లిక అవరోధం కూడా కావడం వల్ల అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే అంతకన్నా పైన నిలదొక్కుకోవడం అవసరం. కరెక్షన్‌లో పడినా అప్‌ట్రెండ్‌ నిలబెట్టుకోవాలంటే కీలక స్థాయి 17000 వద్ద రికవరీ తప్పనిసరి.


బేరిష్‌ స్థాయిలు: 17000 వద్ద విఫలమైతే మరింత బలహీనతగా భావించి స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయి 16750. ఇక్కడ కూడా విఫలమైతే మరో ప్రధాన మద్దతు స్థాయి 16400. 


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారంలో ఈ సూచీ 36000 వద్ద స్వల్ప రికవరీ సాధించి ఆ స్థాయి కన్నా పైన క్లోజయింది. అయితే గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల నడుమ అనిశ్చితంగా ముగిసింది. స్వల్పకాలిక ధోరణి ఇప్పటికీ బలహీనంగా ఉంది. ఇక్కడ విఫలమైతే ప్రధాన మద్దతు స్థాయిలు 35500, 35300, 35000.


పాటర్న్‌: నిఫ్టీ ఇప్పటికీ ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగువనే ఉంది. 16600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ రేఖ కన్నా కొంత దూరంలో ఉంది. 100 డిఎంఏ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. గత వారం 200 డిఎంఏ వద్ద మైనర్‌ రికవరీ సాధించింది.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది. 

Advertisement
Advertisement