ఈ రాశివారు బుధవారం అలర్ట్‌గా ఉంటే బెటర్.. లేదంటే ఊహించని సమస్యలు తప్పవు!

ABN , First Publish Date - 2022-01-23T20:17:16+05:30 IST

మీ ఓర్పునకు పరీక్షా సమయం. ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

ఈ రాశివారు బుధవారం అలర్ట్‌గా ఉంటే బెటర్.. లేదంటే ఊహించని సమస్యలు తప్పవు!



జనవరి 23 నుంచి 29 వరకు.. వార ఫలాలు.. జన్మనక్షత్రం ప్రకారం..

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: అన్ని రంగాల వారికీ కలిసి వచ్చే సమయం. కార్యం సిద్థిస్తుంది. వ్యవహా రాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. శుభ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచ యాలు బలపడతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడ తారు. పిల్లల భవిష్యత్తుపై శ్రద్థ వహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. స్థిరాస్తిక్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు. 


వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అయిన వారు తోడుగా నిలు స్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహ పడవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మంగళ, బుధవారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించ వద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆరోగ్యం జాగ్రత్త. 


మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో ఊహించని సంఘటనలు ఎదుర వుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. 



కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదివారం నాడు ముఖ్యల కలయిక వీలుపడదు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించ వద్దు. 


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడ తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖరీదైన వస్తు వులు కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొంత మందికి అపోహ కలిగిస్తుంది. మంగళవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ ఆలోచనలను కొంతమంది నీరుగారుస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. 


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: మీ సమర్థత ఎదుటివారికి తెలిసివస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రత్యర్థులలో మార్పు వస్తుంది. పదవులు, బాధ్యతలు చేపడతారు. తొందరపడి హామీలివ్వ వద్దు. బుధ, గురు వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 



తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. ఎదుటివారి తీరును గమనించి మెల గండి. వాదనలకు దిగవద్దు. ఖర్చులు అదు పులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషి స్తారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరి ష్కారమవుతుంది. మానసికంగా కుదుట పడతారు. పనులు చురుకుగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో పత్రాలు, విలువైన వస్తు వులు జాగ్రత్త. గృహంలో మార్పులు అని వార్యం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. 


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు స్వీకరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రాలు అందుకుంటారు. పాత పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు హాజరవుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: మీ ఓర్పునకు పరీక్షా సమయం. ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ప్రియత ముల కలయికతో కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవు తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు.  వేడుకల్లో అత్యుత్సాహం తగదు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఆశావహదృక్పథంతో మెల గండి. విమర్శలు పట్టించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు వేగవంతమ వుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి  వ్యవహరించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. 


కుంభం

 ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఎంత కష్టించినా ఫలితం ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందు తారు. పిల్లల మొండితనం అసహనం కలిగి స్తుంది. ఎవరినీ నిందించవద్దు. మాటతీరు అందుపులో ఉంచుకోండి. ఆప్తులతో సంభా షణ ఉపశమనం కలిగిస్తుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహా యం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అం దించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 


మీనం 

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ఈ వారం కలిసివచ్చే సమ యం. అవకాశాలు కలిసివస్తాయి.  స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వాహనం, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల సాను కూలతకు మరింత శ్రమంచాలి. కొత్త వ్యక్తు లతో జాగ్రత్త. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పిల్లల చదు వులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. 


Updated Date - 2022-01-23T20:17:16+05:30 IST