Apr 11 2021 @ 14:06PM

ఆ సినిమాను గుర్తుకు తెచ్చుకున్న అమితాబ్.. హాష్‌తో అక్కినేని బంధం

సోషల్‌ మీడియాలో భాగమైన ఇన్‌స్టాగ్రామ్‌లో మన తారలు వారి ముచ్చట్లను షేర్‌ చేసుకున్నారు. 

* ఆదివారం జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా సమంత అక్కినేని, పెంపుడు కుక్క హాష్‌కి సంబంధించిన ఫొటోను షేర్‌ చేసుకుంది. ఈ ఫొటోలో నాగచైతన్యతో పాటు హాష్‌ కూడా ఉన్నాడు. ఫొటోతో పాటు హాష్‌తో తనకు, చైతన్యకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంది సమంత.

*ఈ సమ్మర్‌లో అర్జున్‌ కపూర్‌తో కలిసి హీటు పెంచుతానని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అర్జున్‌ కపూర్‌, రకుల్‌ చేస్తున్న సినిమా సాంగ్‌ను రేపు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను షేర్‌ చేసింది రకుల్‌. టీ సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

*అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ కలిసి నటించిన 'చుప్కే చుప్కే' సినిమాకు 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమాలో ఓ స్టిల్‌ను పోస్ట్‌ చేసిన అమితాబ్‌. సినిమాను నిర్మాత ఎన్‌.సి.సిప్పీ ఇంట్లో నిర్మించారని తెలిపారు. ఆ ఇంటిని సిప్పీ అమ్ముతుంటే అమితాబ్‌ కొన్నారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అమ్మేశారు. అయితే మళ్లీ ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేసి పునః నిర్మించుకున్నామని తెలిపారు అమితాబ్‌. ఆ ఇల్లే ఇప్పుడు తాముంటున్న జల్సా అని అమితాబ్‌ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 

*పైజామా వేసుకున్న ఓ ఫొటోను షేర్‌ చేసిన కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ లుంగీ అంత కంఫర్ట్‌గా ఉండే పైజామా కావాలని తన అసిస్టెంట్‌ను అడిగితే ఇది పట్టుకొచ్చాడని కామెంట్‌ పెట్టాడు

*నువ్వు ఎవరివైనా, నువ్వు ఏ పని చేసినా, ప్రేమలో ఉండు అంటూ బాలీవుడ్ హాట్‌ బ్యూటీ ఈషా గుప్తా ఓ స్టైలిష్‌ లుక్‌ ఉన్న ఫొటోను కామెంట్‌తో పాటు షేర్‌ చేసింది.

*సముద్ర పాట అంటూ 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేసింది.







ఆంధ్రప్రదేశ్ మరిన్ని...