Abn logo
Oct 30 2020 @ 13:39PM

విజయ్‌కి షాకిచ్చిన స్టార్‌ డైరెక్టర్‌..?

Kaakateeya

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ 65వ సినిమాను ఎ.ఆర్‌.మురుగదాస్‌ డైరెక్ట్‌ చేయడం దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ స్టార్‌ డైరెక్టర్‌ షాకిస్తూ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో, ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. విజయ్‌ తాజా చిత్రం ‘మాస్టర్‌’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది.  ఆ తరువాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించాల్సి ఉంది. కరోనా కారణంగా బడ్జెట్‌ తగ్గించాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించిందని, మురుగదాస్‌ ఆశించిన దానికన్నా తక్కువ పారితోషికం ఇస్తామనడంతో ఆయన చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో విజయ్‌ తదుపరి చిత్రానికి దర్శకుడు ఎవరు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ఈ లిస్టులో పేరరసు, మగిళ్‌ తిరుమేని, మోహన్‌రాజా, హరి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, పేరరసుకే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇది వరకు విజయ్‌ నటించిన ‘తిరుప్పాచ్చి’, ‘శివకాశి’ తదితర చిత్రాలకు పేరరసు దర్శకత్వం వహించగా, రెండు మంచి విజయాన్ని సాధించాయి. 


Advertisement
Advertisement