Abn logo
Aug 2 2020 @ 03:38AM

ఆసియా కప్‌ ‘ఫేవరెట్‌’.. ఛెత్రి

న్యూఢిల్లీ: భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి 2019 ఆసియా కప్‌ ఫేవరెట్‌ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎంపిక కోసం ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎ్‌ఫసీ) 19 రోజులపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో మొత్తం 5,61,856 ఓట్లు పోలయ్యాయి. ఛెత్రి 51 శాతం ఓట్లతో  ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు ఎల్డోర్‌ షోమురొదోవ్‌ (49)ను అధిగమించి అగ్రస్థానం సాధించాడు. ఆసియా కప్‌లో 35 ఏళ్ల సునీల్‌ గ్రూప్‌ దశలో రెండు గోల్స్‌ నమోదు చేశాడు. కాగా, గతేడాది ఛెత్రిని ఎఎ్‌ఫసీ ‘ఆసియా ఐకాన్‌’గా ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement