Abn logo
Feb 27 2021 @ 04:16AM

నువ్వేమన్నా ఆడపిల్లవా అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే బదులిచ్చిన స్టార్ కిడ్!

ముంబై: భారత చలన చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. గతేడాది మరణించిన ఈ స్టార్ యాక్టర్ కుమారుడు బబిల్‌ను అవమానించాడో నెటిజన్. అతను మేకప్ వేసుకున్న ఫొటోలను చూసి ‘‘నువ్వేమన్నా ఆడపిల్లవా?’’ అంటూ ప్రశ్నించారు. ఇలా అడిగిన వ్యక్తికి దిమ్మతిరిగే సమాధానమిచ్చాడీ స్టార్ కిడ్. ‘‘ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో రెండు శక్తులు ఉంటాయని నేను నమ్ముతా. మగాడిలోని స్త్రీతనాన్ని గుర్తించడం నిజమైన మగతనం. ఈ విషయం అర్థం చేసుకోకపోతే వాళ్లు మగాళ్లు కానట్లే. ఇదే విషపూరిత మగతనం’’ అని బదులిచ్చాడు. ఇది చూసిన చాలామంది అద్భుతంగా ఉందీ సమాధానం అంటూ మెచ్చుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement